KURNOOL DISTRICT OPEN CHESS TOURNAMENT CLOSING PUNCTUATION 19/09/2021
Posted on 19-09-2021
News image

చదరంగం పోటీలు ముగిసాయి

 ఆళ్లగడ్డ ప్రజ్ఞ జూనియర్ కళాశాలలో జరిగినటువంటి జిల్లాస్థాయి చదరంగం పోటీలలో డోన్ కు చెందినటువంటి నిహాల్ మొదటి స్థానము, ఆళ్లగడ్డ చెందినటువంటి భాను ప్రకాష్ రెండవ స్థానము,   ఆళ్లగడ్డ చెందినటువంటి చాంద్ బాబు నాయక్ మూడవ స్థానం కైవసం చేసుకున్నారని టోర్నమెంట్ ఆర్గనైజర్ ఇమామ్ హుస్సేన్ తెలిపారు.
 ఈయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ కు రెండు,మూడు స్థానాలు రావడం ఎంతో ఆనందదాయకం గా ఉందన్నారు.  మొదటి పది స్థానాలకు క్యాష్ ప్రైజ్, మరియు క్యాటగిరి విభాగాలలో బాలబాలికలకు మెమెంటోలు,  మెడల్స్ అందజేశారు అన్నారు.
 ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అకాడమిక్ అడ్వైజర్ ప్రజ్ఞా నరసింహా రెడ్డి, టోర్నమెంట్ స్పాన్సర్ సాంబ,పేరాయి పల్లి హెచ్ఎం భాష, ఆల్ కర్నూల్ అసోసియేషన్ సెక్రెటరీ రామ సుబ్బారెడ్డి, సీనియర్ ప్లేయర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.