Chess Tournament broucher
Posted on 09-10-2021
News image

నంద్యాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ చేస్ టోర్నమెంట్*

**************************

ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆల్ కర్నూల్ చెస్ అసోసియేషన్ నిర్వహణలో, అక్టోబర్ 31వ తేదీ, నవంబర్ 1వ తేదీన రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది.

ఈ సందర్భంగా పోటీల నిర్వహణ వివరాలు తెలిపే కరపత్రాలను రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఆల్ కర్నూల్ చెస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్. జి. రామకృష్ణ రెడ్డి, గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి ఇ కోశాధికారి నాగశ్రీనిష్ , తిరుపాలు తదితరులు విడుదల చేశారు.

ఈ నెల 27వ తేదీ లోపు పాల్గొనేవారు www.apchess.org వెబ్ సైట్లో ఎంట్రీలు నమోదు చేయించుకోవాలి. ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు:9010451585,

9573661799.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి ,డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులకు మాత్రమే అనుమతి ఉంటుందని, 55 వేల రూపాయల నగదు బహుమతితో పాటు 110 జ్ఞాపికలు బహుమతులుగా విజేతలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకుని తమ ప్రతిభను చూపించి, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని కోరారు.