ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ఈ రోజున నిర్వహించిన అనంతపురం జిల్లా మహిళా చెస్ చాంపియన్షిప్ మరియు అనంతపురం జిల్లా అండర్ 15 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్ విజయవంతంగా ముగిసాయి. ఈ పోటీలో ఎంపికైన అటువంటివారు జనవరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అనంతపురం జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు అని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ తెలిపారు. విజేతలందరికీ డిసిపి వర్మ గారు మెడల్స్ ను మరియు ప్రశంసాపత్రాలను అందజేశారు. రాష్ట్రస్థాయిలో అనంతపురం జిల్లా యొక్క కీర్తిని ఇనుమడింపచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ చైర్మన్ బాలరాజు అధ్యక్షుడు శివకుమార్, ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఉదయ్ కుమార్ నాయుడు , టోర్నమెంట్ కోఆర్డినేటర్ మెహరాజ్ పాల్గొని విజేతలందర్నీ అభినందించారు.
అనంతపురం జిల్లా మహిళా చదరంగ ఛాంపియన్షిప్-2022 విజేతలు
ప్రథమ స్థానం : లాక్షిణ్య
ద్వితీయ స్థానం : ఫర్హత్
తృతీయ స్థానం : సంజన
నాల్గవ స్థానం : శ్రీహ
అనంతపురం జిల్లా అండర్ 15 ఓపెన్ చెస్ చాంపియన్షిప్-2021 విజేతల వివరాలు:
ప్రథమ స్థానం : సామ్యూల్ స్టీఫెన్ నోబుల్
ద్వితీయ స్థానం : భరత్ భూషణ్
తృతీయ స్థానం : షణ్ముఖనందు
నాల్గవ స్థానం : విశ్వాస్
అనంతపురం జిల్లా అండర్ 15 బాలికల చెస్ చాంపియన్షిప్-2021 విజేతల వివరాలు:
ప్రథమ స్థానం : ఫర్హత్
ద్వితీయ స్థానం : శ్రీహ
తృతీయ స్థానం : లాక్షిణ్య
నాల్గవ స్థానం : సంజన
