ఈ నెల 3 , 4 వ తేదీలలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపం వేదికగా గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నైట్స్ క్యాజెల్ చెస్ అకాడమీ వారు నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్స్ ఛాంపియన్షిప్-2022 ఎంపిక పోటీల్లో అనంతపురం క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. అండర్-13 బాలికల విభాగంలో శ్రీహ చాంపియన్షిప్ ను కైవసం చేసుకుని త్వరలో జరగబోయే 9వ నేషనల్ స్కూల్స్ చెస్ చాంపియన్షిప్-2022 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది.
అలాగే , అండర్-13 బాలికల విభాగంలో 5 వ స్థానాన్ని భువన కృతి , అండర్-11 ఓపెన్ విభాగంలో రెండవ స్థానాన్ని సామ్యూల్ స్టీఫెన్ నోబుల్ , అండర్-9 ఓపెన్ విభాగంలో 4వ స్థానాన్ని సహృద్ , అండర్-9 బాలికల విభాగంలో 4 వ స్థానాన్ని వర్ణిగ , అండర్-7 ఓపెన్ విభాగంలో 3వ స్థానాన్ని అన్ని శ్రీ సాకేత్ ,అండర్ 15 ఓపెన్ విభాగంలో 2వ స్థానాన్ని భరత్ భూషణ్ , 4వ స్థానాన్ని షణ్ముఖ నందు, అండర్ 15 బాలికల విభాగంలో 2వ స్థానాన్ని సంజన , 4వ స్థానాన్ని లాక్షిణ్య కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచినటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా విజేతలందరినీ ఆల్ అనంతపూర్ సోషల్ చైర్మన్ బాలరాజు, అధ్యక్షకార్యదర్శులు శివకుమార్ , ఉదయ్ కుమార్ నాయుడు అభినందించారు.
