ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా అండర్ 12 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2022 ఎంపిక పోటీలు అనంతపురం నగరంలోని 3వ రోడ్డులో గల కారుణ్య ప్రీ స్కూల్లో విజయవంతంగా ముగిశాయి.
ఓపెన్ విభాగంలో 5 రౌండ్లు నిర్వహించగా
ప్రథమ స్థానం :సామ్యూల్ స్టీఫెన్ నోబెల్ 5/5
ద్వితీయ స్థానం: యం.పి.సహృద్ 4 /5
బాలికల విభాగంలో 4 రౌండ్లు నిర్వహించగా
ప్రథమ స్థానం: జి. శ్రీహ 3.5/4
ద్వితీయ స్థానం: ఆర్. వర్ణిగ 3.5/4
వీరందరూ కూడా ఈ నెల 19, 20 తేదీల్లో రాజమండ్రి లో జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అండర్ 12 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2022 పోటీల్లో అనంతపురం జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు అని టోర్నమెంట్ డైరెక్టర్ మెహరాజ్ తెలిపారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కారుణ్య ప్రీ స్కూల్ కరస్పాండెంట్ విజయ గోపాల్ , టీచర్లు వైష్ణవి , సుధ , ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ బాలరాజు , అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు , టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున , చెస్ కోచ్ అదిరత్న కుమార్ , ఆర్బిటర్ హుసేన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Congratulations to all Winners from AACA
