స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్తంగా అఖిలభారత సమాఖ్య కు అనుసంధానంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చెస్ ఇన్ స్కూల్స్ ట్రైనర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఆంధ్ర ప్రదేశ్ శ్రీ ఎన్. ప్రభాకర్ రెడ్డి గారు హాజరై ఆంధ్ర ప్రదేశ్ లో చదరంగ వ్యాప్తికి కృషి చేస్తామని అందులో భాగంగానే *చదరంగ భారతి* పేరుతో *పైలట్ ప్రాజెక్ట్* ద్వారా ఆంధ్రప్రదేశ్ చెస్ ఇన్ స్కూల్స్ ట్రైనర్స్ ను రూపొందించే దిశగా కృషి చేస్తున్నామని, తద్వారా ప్రతి పాఠశాలలో కూడా చదరంగాన్ని ఒక ఎడ్యుకేషనల్ టూల్ లాగా చదువులో భాగంగా చేయడానికి ప్రయత్నిస్తామని ఇది విద్యార్థుల మీతో వికాసానికి ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో ప్రతి గ్రామంలో కూడా ఒక చెస్ క్లబ్ ఏర్పాటు చేయడానికి ఆంధ్ర చెస్ అసోసియేషన్ తో కలిపి ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కె.వి.వో శర్మగారు, కార్యదర్శి భీమారావు గారు, కోశాధికారి జ్వాలాముఖి గారు , సంయుక్త కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు హాజరై భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చదరంగం వ్యాప్తికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరవుగా 6 మందితో కూడినటువంటి శిక్షకుల కమిటీ వీరికి మూడు రోజులపాటు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ చదరంగ భారతి పేరుతో ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ చెస్ ఇన్ స్కూల్స్ ట్రైనర్స్ కార్యక్రమానికి ముఖ్య శిక్షకులుగా ఫిడే ఇన్స్ట్రక్టర్స్ ( FIDE Instructors) రవీంద్ర రాజు మరియు కళ్యాణ్ కుమార్ ,అజీజ్, సహ-శిక్షకులుగా కళ్యాణ్ చక్రవర్తి , చంద్రమౌళి , కార్తిక్ గోపాల్ వ్యవహరిస్తున్నారు.
