SPSR NELLORE DISTRICT U07 & U09 OPEN & GIRLS CHESS CHAMPIONSHIP
Posted on 20-02-2023
News image

*ముగిసిన జిల్లా స్థాయి అండర్ -7 మరియు అండర్ -09 ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు*


ఈరోజు కోవూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు *అండర్ 07 మరియు అండర్ 09* ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు *SPSRనెల్లూరు చెస్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహించారు.


ఈ పోటీలలో ఆయా కేటగిరీలలో *మొదటి రెండు స్థానాలలో* నిలిచినటువంటి చదరంగ క్రీడాకారులు త్వరలో జరగబోయే *రాష్ట్రస్థాయి పోటీలకు* జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.


ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు స్కూల్ *ప్రిన్సిపల్ హనుమంతరావు గారు మరియు డీన్ పెంచల బాబు* గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది అని *SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్* కార్యదర్శి *పి మస్తాన్ బాబు* తెలిపారు.


ఈ టోర్నమెంట్ లకు ఆర్బిటర్లుగా *సూరం వంశీకృష్ణ; కాకుమూడి స్వాతి మరియు విన్నకోటి కిషోర్ వ్యవహరించారు* టోర్నమెంట్లకు వేముల ప్రదీప్ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు


*విజేతలు వీరే*

*అండర్ 07* ఓపెన్ - విభాగం::


1.*బట్టారం సహస్ర*  -  నెల్లూరు

2. *కామా మురళి శంకర్ రెడ్డి*  -  నెల్లూరు


*అండర్ 07* - బాలికల  విభాగం::

1.*బట్టారం సహస్ర* -  నెల్లూరు

2. *R V S మౌక్తిక* -  నెల్లూరు


*అండర్ 09* -  ఓపెన్ - విభాగం::


1. *చెరుకూరి యశ్విన్ కుమార్* -  నెల్లూరు


2. *బండి కీర్తన* -  నెల్లూరు


*అండర్ 09* - బాలికల విభాగం::


1.*బండి కీర్తన* - నెల్లూరు 


2. *బట్టారం సహస్ర*-  నెల్లూరు