*ముగిసిన జిల్లా స్థాయి అండర్ -11మరియు అండర్ -13 ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు*
ఈరోజు కోవూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు *అండర్ 11 మరియు అండర్ 13* ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు *SPSRనెల్లూరు చెస్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ పోటీలలో ఆయా కేటగిరీలలో *మొదటి రెండు స్థానాలలో* నిలిచినటువంటి చదరంగ క్రీడాకారులు త్వరలో జరగబోయే *రాష్ట్రస్థాయి పోటీలకు* జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు స్కూల్ *ప్రిన్సిపల్ హనుమంతరావు గారు మరియు డీన్ పెంచల బాబు* గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది అని *SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్* కార్యదర్శి *పి మస్తాన్ బాబు* తెలిపారు.
ఈ టోర్నమెంట్ లకు ఆర్బిటర్లుగా *సూరం వంశీకృష్ణ; కాకుమూడి స్వాతి మరియు విన్నకోటి కిషోర్ వ్యవహరించారు* టోర్నమెంట్ పర్యవేక్షకుడిగా వేముల ప్రదీప్ వ్యవహరించారు
*విజేతలు వీరే*
*అండర్ 11* ఓపెన్ - విభాగం::
1.*హేమల వర్షన్ అందల మాల* - నెల్లూరు
2. *ఎంవీఎస్ యగ్నేశ్వర్ రెడ్డి* - నెల్లూరు
*అండర్ 11* - బాలికల విభాగం::
1.*కీర్తన బండి* - నెల్లూరు
2. *మనస్విని కొండూరు* - నెల్లూరు
*అండర్ 13* - ఓపెన్ - విభాగం::
1. *అందలమల హేమల వర్షన్* - నెల్లూరు
2. *చెముడు గుంట ద్వారకా నాథ్* - నెల్లూరు
*అండర్ 13* - బాలికల విభాగం::
1.*గోడ్డేటి హిమ తేజస్విని* - బుచ్చిరెడ్డిపాలెం
2. *జాన్వితేజిని అందనమాల*- నెల్లూరు
