మార్చి 1 ను ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ మరియు ఫిడే సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో మొట్టమొదటిసారిగా తాడిపత్రి పట్టణానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ సాధించిన వెంకటకృష్ణ సురేంద్ర మరియు అస్మిత అనిమీ లను ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు అభినందించారు.
ప్రతి నెల కొత్త క్రీడాకారులు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగును సాధిస్తుండటం అనంతపురం జిల్లాలో జరుగుతున్న చదరంగా అభివృద్ధికి తార్కాణం.
సముద్రాల వెంకట కృష్ణ సుధీంద్ర
తల్లి: లక్ష్మీ మమత
తండ్రి: S.V. సురేంద్రనాథ్
పాఠశాల టార్గెట్ E.M. స్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నాడు.
ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ క్లాసికల్ విభాగంలో 1132ను ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ విభాగంలో 1276 ను సాధించాడు.
తండ్రి S.V. సురేంద్రనాథ్ గారే కొడుకుకి చదరంగం శిక్షకుడు.
నేషనల్ స్కూల్స్ అండర్ 13 చెస్ చాంపియన్షిప్ లో పాల్గొని , 3/6 సాధించి , తాత గారి మరణం వలన మధ్యలోనే నిష్క్రమించాడు.
ఫిబ్రవరిలో 3వ యస్.సి.యం.ఏ. ఆల్ ఇండియా ఫిడే ర్యాపిడ్ రేటింగ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో 4.5/9 పాయింట్లు సాధించాడు.
అస్మిత అనిమి
తల్లితండ్రులు: ఎ.మాధవి లత, ఎ.కంబగిరి స్వామి
వయస్సు: 12 సంవత్సరాలు
తాడిపత్రిలోని శ్రీ చైతన్య E/M స్కూల్ లో 7వ తరగతి చదువుతున్నది.
ఇంటర్నేషనల్ క్లాసికల్ ఫిడే రేటింగ్ విభాగంలో 1056 ను సాధించింది.
ఎస్వి సురేంద్రనాథ్ గారి దగ్గర చదరంగ శిక్షణ తీసుకుంది.
జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన V4 ఇంటర్నేషనల్ ఫైడ్ రేటింగ్ క్లాసికల్ టోర్నమెంట్ లో 4/9 పాయింట్లు సాధించి అండర్ 13 బాలికల విభాగంలో ఏడవ స్థానం సంపాదించుకొని ట్రోఫీని అందుకుంది.
