*చదరంగంలో బుచ్చిరెడ్డిపాలెం శ్రీ చైతన్య స్కూల్ కు చెందిన అక్క తమ్ముళ్ల కు ఒకేసారి అంతర్జాతీయ ఫీడే రేటింగ్*
చదరంగం లో బుచ్చిరెడ్డిపాలెం శ్రీ చైతన్య స్కూల్ లో చదువుతున్న ఒకే కుటుంబానికి చెందిన అక్క తమ్ముళ్లు *మునగాల కారుణ్య* మరియు *మునగాల లోకేశ్వర్ రెడ్డి* చదరంగంలో విశేష ప్రతిభ కనబరిచి *అంతర్జాతీయ రాపిడ్ రేటింగ్ విభాగం* లో చోటు సంపాదించారు.
వ్యవసాయం కుటుంబ నేపథ్యం కలిగిన వీరు చదరంగం పట్ల మక్కువతో గత కొంతకాలంగా రోజుకు రెండు మూడు గంటలు తగ్గకుండా కోచ్ వేముల ప్రదీప్ దగ్గర శిక్షణ తీసుకుంటూ మరియు ప్రాక్టీస్ చేస్తూ ఆట లోని మెలుకువలను మరియు ఆట తీరును మెరుగుపరచుకొని ఫిబ్రవరి నెలలో బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ ఫిడే రాపిడ్ రేటింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మునగాల కారుణ్య(1160) మరియు మునగాల లోకేశ్వర్ రెడ్డి(1037) పాయింట్లు రేటింగ్ కనీసం చేసుకుని ఫిబ్రవరి 28వ తేదీ విడుదల చేసిన అంతర్జాతీయ రేటింగ్స్ లో అంతర్జాతీయ రాపిడ్ రేటింగ్ చదరంగ క్రీడాకారులుగా చోటు సంపాదించారు వారు ఈ రేటింగ్ సంపాదించడానికి వారి తల్లిదండ్రుల శ్రీ చైతన్య స్కూల్ ఉపాధ్యాయుల సహకారం వెలకట్టలేనిదని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాబోయే రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు మరియు కోచ్ సహాయంతో తమ ఆట తీరును మరింత మెరుగుపరుచుకుని గ్రాండ్ మాస్టర్ అయ్యే దిశగా తమ అడుగులు ముందుకు వేస్తామని తెలిపారు.
క్రీడాకారులు అంతర్జాతీయ చదరంగం రేటింగ్ సాధించిన సందర్భంగా ఎంఈఓ దిలీప్ గారు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ రామాంజనేయులు గారు మరియు డీన్ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు ఈ క్రీడలో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పీ మస్తాన్ బాబు గారు ప్రత్యేకంగా అభినందించారు
పేరు:: మునగాల కారుణ్య
తండ్రి పేరు :: మునగాల మహేందర్ రెడ్డి
తల్లి పేరు :: మునగాల లక్ష్మి
తరగతి ::ఎనిమిది
స్కూలు:: శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బుచ్చిరెడ్డిపాలెం
అంతర్జాతీయ రాపిడ్ రేటింగ్ :: 1160
లక్ష్యం :: గ్రాండ్ మాస్టర్ కావడం
పేరు:: మునగాల లోకేశ్వర్ రెడ్డి
తండ్రి పేరు :: మునగాల మల్లికార్జున రెడ్డి
తల్లి పేరు :: మునగాల దేవసేన
తరగతి : ఏడు
స్కూలు:: శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బుచ్చిరెడ్డిపాలెం
అంతర్జాతీయ రాపిడ్ రేటింగ్ :: 1037
లక్ష్యం :: గ్రాండ్ మాస్టర్ కావడం
