అనంతపురం జిల్లా అండర్-11 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 ఓపెన్ విజేత సహృద్ , బాలికల విజేత సుకృత
అనంతపురం జిల్లా గుంతకల్లులోని పెంగ్విన్ ఆక్టివిటీ క్లబ్ వేదికగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతపురం జిల్లా అండర్-11 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 కు 49 మంది క్రీడాకారులు పాల్గొన్నారు అని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.
అనంతపురం జిల్లా అండర్-11 ఓపెన్ విభాగంలో ప్రథమ స్థానం: .పి. సహృద్ 5/5 పాయింట్లు , ద్వితీయ స్థానం : సామ్యూల్ స్టీఫెన్ నోబుల్ 4/5 పాయింట్లు, తృతీయ స్థానం: రిషిక్ 4/5 పాయింట్లు
అనంతపురం జిల్లా అండర్-11 బాలికల విభాగంలో ప్రథమ స్థానం: సుకృత 4/4 పాయింట్లు , ద్వితీయ స్థానం : యశస్విని అనిమి 4/4 పాయింట్లు, తృతీయ స్థానం: త్రిపాద 3/4 పాయింట్లు
రెండు విభాగాల్లోనూ మొదటి మరియు రెండవ స్థానం సాధించిన క్రీడాకారులు అనంతపురం జిల్లా తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అండర్-11 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో పాల్గొంటారు.
బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ నాగార్జున గారు, అభయ విజ్ఞాన్ నిధి ఫౌండర్ వసుంధర గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మాంటిస్సోరి స్కూల్ శ్రీనివాసులు గారు, చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున , ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తదితరులు హాజరయ్యారు.
