SPSR NELLORE DISTRICT UNDER 17 OPEN & GIRLS CHESS CHAMPIONSHIP
Posted on 08-03-2023
News image

*ముగిసిన జిల్లా స్థాయి అండర్ -17 ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు*


ఈరోజు కోవూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు *అండర్ 17* ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు *SPSRనెల్లూరు చెస్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహించారు.


ఈ పోటీలలో ఆయా కేటగిరీలలో *మొదటి 2 స్థానాలలో* నిలిచినటువంటి చదరంగ క్రీడాకారులు త్వరలో జరగబోయే *రాష్ట్రస్థాయి పోటీలకు* జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.


ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు స్కూల్ *ప్రిన్సిపల్ హనుమంతరావు గారు మరియు డీన్ పెంచల బాబు* గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది అని *SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్* కార్యదర్శి *పి మస్తాన్ బాబు* తెలిపారు.


ఈ టోర్నమెంట్ లకు ఆర్బిటర్లుగా *సూరం వంశీకృష్ణ; కాకుమూడి స్వాతి మరియు విన్నకోటి కిషోర్ వ్యవహరించారు* టోర్నమెంట్ పర్యవేక్షకుడిగా వేముల ప్రదీప్ వ్యవహరించారు


*విజేతలు వీరే*

*అండర్ 17* ఓపెన్ - విభాగం::

1.*అందల మాల హేమల వర్షన్*  -  నెల్లూరు

2. *షేక్ సమద్*, నెల్లూరు


*అండర్ 17 బాలికల విభాగం*::


 1.*గొడ్డేటి హిమ తేజస్విని* - బుచ్చిరెడ్డిపాలెం


2.*ప్రద్యుమ్న లక్ష్మి వేముల*-  కొత్త వంగల్లు