AP Women Team Clinched Bronze medal in ALL INDIA CIVIL SERVICES WOMEN TEAM CHESS TOURNAMENT -2022-23
Posted on 22-03-2023
News image

ఆలిండియా సివిల్స్ సర్వీసెస్ టీం చెస్ టోర్నమెంట్ -2022-23 ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో గల విశ్వనాథన్ ఆనంద్ చెస్ హాల్ వేదికగా నిర్వహించబడినటువంటి ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళా క్రీడాకారిణుల జట్టు 3వ స్థానం కైవసం చేసుకుంది. కెప్టెన్ గా వ్యవహరించిన పెంకి శివశ్రీ , ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ , అన్నవరం మరియు ఇతర జట్టు క్రీడాకారిణులు మల్ల యమున , ఇంజనీరింగ్ అసిస్టెంట్ కొమరాపురం సచివాలయం పాయకరపేట, షేక్ జాస్మిన్ ఫిర్దౌస్, మహిళా పోలీస్ గుంతకల్ మున్సిపాలిటీ, నేలబల్లి మంజుల గారు హెడ్ మాస్టర్ జెడ్పిహెచ్ఎస్ ఒజిలి పనిచేస్తున్నారు మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యవర్గానికి చెందిన నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ కి అధ్యక్షురాలు హోదాలో కూడా వ్యవహరిస్తున్నారు, పి దివ్య మహిళా పోలీస్ తుమ్మలపల్లి సచివాలయం కడప, పి యల్ అపూర్వ గుత్తుల మేనేజర్ వార్డ్ ప్లానింగ్ అండ్ సెక్రటరీ అమలాపురం.


       ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి మొత్తం మహిళా జట్టు క్రీడాకారిణులందరికీ మరియు నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ ముందడి నడిపిస్తూ 400 మందికి పైగా చదరంగం క్రీడాకారులను తీర్చిదిద్దిన ఆంధ్రప్రదేశ్ చదరంగం సభ్యురాలు శ్రీమతి మంజుల గారికి ఆంధ్ర చెస్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.



             ఇటీవల ఒరిస్సాలోని కిట్స్ ( KIITS ) యూనివర్సిటీలోని హాలుని విశ్వనాథన్ ఆనంద్ చెస్ హాల్ గా నామకరణం చేసిన సందర్భంగా విశ్వనాథన్ ఆనంద్ గారు, భరత్ సింగ్ చౌహాన్ గారు తదితర ప్రముఖులు హాజరయ్యారు. అటువంటి ప్రముఖ హాల్లో మార్చి 11 నుండి 14 వరకు నిర్వహించినటువంటి ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ మహిళా టీమ్ చెస్ టోర్నమెంట్-2022-23 లో బ్రోంజ్ మెడల్ (3వ స్థానం) సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళా జట్టు క్రీడాకారిణులందరికీ కూడా ప్రముఖ గ్రాండ్ మాస్టర్ డిబ్యేందు బరువా గారు, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సంయుక్త-కార్యదర్శి శ్రీ రంజన్ మొహంతి గారు మరియు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇతర చదరంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని వీరికి బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది.