అనంతపురం జిల్లా అండర్-13 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 ఓపెన్ విజేత సహృద్ , బాలికల విజేత శ్రీహ
అనంతపురం జిల్లా గుంతకల్లులోని పెంగ్విన్ ఆక్టివిటీ క్లబ్ వేదికగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతపురం జిల్లా అండర్-13 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 కు 49 మంది క్రీడాకారులు పాల్గొన్నారు అని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.
అనంతపురం జిల్లా అండర్-13 ఓపెన్ విభాగంలో
ప్రథమ స్థానం: యం.పి. సహృద్ 5/5 పాయింట్లు
ద్వితీయ స్థానం : క్రిష్ణ కార్తీక్ బొమ్మారెడ్డి 4.5/5 పాయింట్లు
తృతీయ స్థానం: రిషిక్ దుడ్యాల 4/5 పాయింట్లు
అనంతపురం జిల్లా అండర్-13 బాలికల విభాగంలో
ప్రథమ స్థానం: జీ శ్రీహ 5/5 పాయింట్లు
ద్వితీయ స్థానం : లాలిత్య వై 4/5 పాయింట్లు
తృతీయ స్థానం: సుకృత 4/5 పాయింట్లు
రెండు విభాగాల్లోనూ మొదటి మరియు రెండవ స్థానం సాధించిన క్రీడాకారులు అనంతపురం జిల్లా తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అండర్-13 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో పాల్గొంటారు.
బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ నాగార్జున గారు, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున , ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తదితరులు హాజరయ్యారు.
