*ముగిసిన జిల్లా స్థాయి ఓపెన్ రాపిడ్ మరియు ఓపెన్ BLITZ చదరంగం పోటీలు*
ఈరోజు కోవూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు *ఓపెన్ రాపిడ్ మరియు ఓపెన్ BLITZ చదరంగం పోటీలు* SPSRనెల్లూరు చెస్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ పోటీలలో ఆయా కేటగిరీలలో *మొదటి 2 స్థానాలలో* నిలిచినటువంటి చదరంగ క్రీడాకారులు త్వరలో జరగబోయే *రాష్ట్రస్థాయి పోటీలకు* జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు స్కూల్ *ప్రిన్సిపల్ హనుమంతరావు గారు మరియు డీన్ పెంచల బాబు* గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది అని *SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్* కార్యదర్శి *పి మస్తాన్ బాబు* తెలిపారు.
ఈ టోర్నమెంట్ లకు ఆర్బిటర్లుగా *సూరం వంశీకృష్ణ వ్యవహరించారు* టోర్నమెంట్ పర్యవేక్షకుడిగా వేముల ప్రదీప్ వ్యవహరించారు
*విజేతలు వీరే*
*రాపిడ్ ఓపెన్ విభాగం*::
1.*గొడ్డేటి హిమ తేజస్విని* - బుచ్చిరెడ్డిపాలెం
2.*షేక్ సమద్*- నెల్లూరు
*Blitz ఓపెన్ - విభాగం*:
1. *రామ్ లిఖిత్ మఖం*- నెల్లూరు
2. *గొడ్డేటి హిమ తేజస్విని* బుచ్చిరెడ్డిపాలెం
