ఆంధ్ర ప్రదేశ్ చదరంగ సంఘం అడహక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతపురం జిల్లా సీనియర్ చదరంగ పోటీలను ఏ.జి.యస్ పాఠశాలలో అనంతపురం తహసిల్దారు గౌరవనీయులు శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి గారు మరియు అనంతపురం జిల్లా చదరంగం ప్రెసిడెంట్ హేమాద్రి గారు ప్రారంభించారు. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కోవిద్ నిబంధనలు పాటిస్తూ జరిగిన ఈ పోటీలలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచినటువంటి క్రీడాకారులను ఈనెల 23 నుండి 25 వరకు నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ చదరంగం పోటీలకు అనంతపురం జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ టోర్నమెంట్ సమన్వయకర్తగా కిషోర్ మరియు చీఫ్ ఆర్బిటర్ గా ఉదయ్ కుమార్ నాయుడు వ్యవహరించారు.
విజేతలకు బహుమతులను ఏ జి ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ సాల్మన్ రాజు గారు, అనంతపురం జిల్లా చదరంగ సంఘం అధ్యక్షకార్యదర్శులు హేమాద్రి , రవి రాజ్ మరియు టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు అందజేశారు.
OPEN Category:
1st Palce : Afreed T Khan
2nd Place: Vishwas
3rd Place: Bharath Bhushan
4th Palce: Kushal O
U9 Category
1st Place: Samuel Stephen Noble
2nd Palce: Niteesh
3rd Place: Harshith
U11 Category
1st Place: Sahrudh
2nd Place: Sreeha
3rd Place: Moksha Priya Sai
Best youngest Female: Vaishnavi
Best youngest Male: Kasyap Abhay Sri vasta
