AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH poster launched by Anantapur District Collector Smt. Gowthami IAS garu
Posted on 13-04-2023
News image

ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య (World Chess Federation FIDE) వారి సౌజన్యంతో అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా మే నెల 11 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించబోయే ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH సంబంధిత టోర్నమెంట్ బ్రోచర్ ను అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి గౌతమి ఐ.ఎ.యస్. గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, చైర్మన్ బాలరాజు, ఆన్-సెట్ సీఈఓ కేశవ నాయుడు గారు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి గారు డైరెక్టర్ ఆఫ్ శ్రీ హర్ష హాస్పిటల్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీమతి వై ప్రీతి రెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ , చెస్ కోచ్ ఆదిరత్న కుమార్ , సీనియర్ నేషనల్ ఆర్బిటర్ మల్లికార్జున, శ్రవణ్ కుమార్, గోవిందరాజులు, దేవరాజ్ , మెహారాజ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చదరంగం క్రీడ ద్వారా మేధోశక్తి పెంపొందిస్తుందని విద్యార్థుల్లో ఏకాగ్రతకి ఎంతో ఉపయోగకరమని, అటువంటిది జాతీయ స్థాయి చదరంగ పోటీలకు అనంతపురం మరొక్కసారి వేదిక కావడం ఆనందదాయకమని డాక్టర్ సుప్రజా చౌదరి, శ్రీమతి ప్రీతి రెడ్డి గారు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చదరంగం క్రీడాకారులు అందరికీ కూడా అంతర్జాతీయస్థాయి ఫిడే రేటింగ్ సాధించడానికి తద్వారా మన అనంతపురం జిల్లాలో కొత్త క్రీడాకారులకు, చదరంగం క్రీడాభివృద్ధి కి ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుందని ,₹50,000/- నగదు బహుమతితో ఈ టోర్నమెంటును నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు. స్విస్ లీగ్ ఫార్మాట్ పద్ధతిలో మొత్తం తొమ్మిది రౌండ్ పోటీలను ఐదు రోజులపాటు నిర్వహిస్తామని టోర్నమెంట్ ఆర్బిటర్ మల్లికార్జున, ఆదిరత్నకుమార్ తెలిపారు. కేవలం ₹250/- ప్రవేశము చెల్లించి ఈ టోర్నమెంట్లో www.apchess.org డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీచెస్.ఓఆర్జి లో నమోదు చేసుకోవచ్చని మరిన్ని వివరాలకు 9581250684 ను సంప్రదించవలసిందిగా టోర్నమెంట్ కోఆర్డినేటర్లు శ్రవణ్ కుమార్ మరియు గోవిందరాజులు తెలిపారు.