అనంతపురం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె. శ్రీనివాసరావు గారు ఐ.పి.యస్. గారి చేతుల మీదుగా AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ
Posted on 03-05-2023
News image

ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య   (World Chess Federation FIDE) వారి సౌజన్యంతో అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా మే నెల 11 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించబోయే ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023  AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH  సంబంధిత టోర్నమెంట్ బ్రోచర్ ను అనంతపురం జిల్లా  సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె. శ్రీనివాసరావు గారు ఐ.పి.యస్. గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి గారు డైరెక్టర్ ఆఫ్ శ్రీ హర్ష హాస్పిటల్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా  చదరంగం క్రీడ ద్వారా మేధోశక్తి పెంపొందిస్తుందని విద్యార్థుల్లో ఏకాగ్రతకి ఎంతో ఉపయోగకరమని,  అటువంటిది జాతీయ స్థాయి చదరంగ పోటీలకు అనంతపురం మరొక్కసారి వేదిక కావడం ఆనందదాయకమని డాక్టర్ సుప్రజా చౌదరి తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చదరంగం క్రీడాకారులు అందరికీ కూడా అంతర్జాతీయస్థాయి ఫిడే రేటింగ్ సాధించడానికి తద్వారా మన అనంతపురం జిల్లాలో కొత్త క్రీడాకారులకు,  చదరంగం క్రీడాభివృద్ధి కి ఈ టోర్నమెంట్  ఉపయోగపడుతుందని ,₹50,000/- నగదు బహుమతితో ఈ టోర్నమెంటును నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు. స్విస్ లీగ్ ఫార్మాట్ పద్ధతిలో మొత్తం తొమ్మిది రౌండ్ పోటీలను ఐదు రోజులపాటు నిర్వహిస్తామని టోర్నమెంట్  కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్  తెలిపారు. కేవలం ₹250/- ప్రవేశము చెల్లించి ఈ టోర్నమెంట్లో www.apchess.org  డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీచెస్.ఓఆర్జి  లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

                 ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ప్రవేశ రుసుముతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థినీ విద్యార్థులకు ఈనెల 6వ తేదీన 1వ రోడ్డులోని చెస్ బెనిఫిట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అనంతపురం జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించబడతాయని వీరిలో ప్రతిభ కనబరిచినటువంటి టాప్-2 బాల బాలికలను అనంతపూర్ లో జరగబోయే ఈ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో పాల్గొంటారని ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 7893878177 సంప్రదించాలని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి గారు, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలిపారు.