ప్రోత్సహిస్తే ప్రభుత్వ పాఠశాల క్రీడాకారులు కూడా రాణిస్తారు: డాక్టర్ సుప్రజా చౌదరి
Posted on 06-05-2023
News image

ప్రభుత్వ పాఠశాలలో క్రీడాకారుల్లో కూడా ప్రతిభను వెలికి తీసేందుకే ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ1 చెస్ అకాడమి వారు స్పాన్సర్ గా ఉచిత ప్రవేశ రుసుముతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థినీ విద్యార్థులకు అనంతపురంలోని 1వ రోడ్డులోని చెస్ బెనిఫిట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన అనంతపురం జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో నిర్వహించగా, శిక్షణలో మరియు పోటీల్లో ప్రతిభ కనబరిచినటువంటి టాప్-5 క్రీడాకారులను అనంతపూర్ లో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య (World Chess Federation FIDE) వారి సౌజన్యంతో అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా మే నెల 11 నుండి 15 వ తేదీ వరకు జరగబోయే ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH పోటీల్లో పాల్గొంటారని , టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి గారు, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు, సీనియర్ నేషనల్ ఆర్బిటర్ జొన్నగడ్డల గౌతమి, ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు , ప్రభుత్వ ఉపాధ్యాయులు రవీంద్ర , ఆనంద్ తెలిపారు.



ప్రథమస్థానం : తేజస్వరూప్ , ఇందిరాగాంధీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాయదుర్గం


ద్వితీయ స్థానం : నరేష్ కుమార్ , మహాత్మ జ్యోతి బాపులే పాఠశాల , బత్తలపల్లి


తృతీయ స్థానం: సాయి దర్శిత్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముద్దినాయనపల్లి , కళ్యాణదుర్గం


నాలుగో స్థానం: గోకుల్ కృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముద్దినాయనపల్లి , కళ్యాణదుర్గం


ఐదవ స్థానం: బ్రమిత, మహాత్మ జ్యోతి బాపులే పాఠశాల , గుమ్మగట్ట మండలం