ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ స్కూల్లో నిర్వహించినటువంటి అనంతపురం జిల్లా సీనియర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్-2023 పోటీల్లో జిల్లావ్యాప్తంగా 34 మంది క్రీడాకారులు పాల్గొనగా, స్విస్ లీగ్ పద్ధతిలో మొత్తం ఆరు రౌండ్లు పోటీలు నిర్వహించారు.
గెలుపొందిన టాప్-4 (నలుగురు ) క్రీడాకారులు , ఈనెల 26-29 వరకు తిరుపతిలో నిర్వహించబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు అని టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ బి శివకృష్ణ గారు, మల్లికార్జున గారు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ప్రీతి రెడ్డి గారు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ చీఫ్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలిపారు.
ఛాంపియన్: అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు 6/6 పాయింట్లు
రన్నరప్ : వెంకట క్రిష్ణ సుదీంద్ర 5/6 పాయింట్లు
తృతీయ స్థానం : వి విశ్వనాథ్ 5/6 పాయింట్లు
నాలుగవ స్థానం : యం.పి. సహృద్ 4.5/6 పాయింట్లు
