ఈనెల 14న నర్సీపట్నంలో జిల్లా స్థాయి (రాష్ట్రస్థాయి ఎంపికలు)చదరంగం పోటీలు
Posted on 11-05-2023
News image

అనకాపల్లి జిల్లా చెస్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఈనెల 14న  నర్సీపట్నం నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో జిల్లాస్థాయి  ఓపెన్ చదరంగం పోటీలు తిరుపతిలో జరుగు రాష్ట్రస్థాయి ఓపెన్ క్యాటగిరీకి నలుగురు విజయవాడలో జరుగు అమ్మాయిల కేటగిరీకి నలుగురిని ఎంపిక చేయడానికి నిర్వహించనున్నట్లు  అనకాపల్లి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు తెలిపారు.  6 సంవత్సరాల  బాల బాలికల నుండి  60 సంవత్సరాల వయస్సు గల వారందరూ  ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులని  ఆయన తెలిపారు. ఓపెన్ కాంపిటీషన్, మరియు మహిళలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో పాల్గొనదలచిన వారు apchess.org నందు రిజిస్టర్ అయిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరములకు 9866846146, 9949996908 నంబర్లకు ఫోన్ చేసి పేరు ముందుగా నమోదు చేయించుకోవాలని  ఆయన కోరారు.