అనంతపురం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ అమ్మి రెడ్డి ఐ.పి.యస్. గారు ముఖ్యఅతిథిగా హాజరై అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా మే నెల 11 నుండి 15 వ తేదీ వరకు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య (World Chess Federation FIDE) వారి సౌజన్యంతో జరుగుతున్న ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH పోటీలను మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శ్రీమతి ప్రీతి రెడ్డి గారు, కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి గారు, టోర్నమెంట్ డైరెక్టర్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్ గారు, డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున, టోర్నమెంట్ కోఆర్డినేటర్స్ గోవిందరాజులు, శ్రవణ్ కుమార్ , ఆర్ట్స్ కళాశాల ఎన్.సి.సి. ఆఫీసర్ రంగనాథం గారు తదితరులు హాజరై పోటీలను ప్రారంభించారు.
పిల్లలు కేవలం చదువులకు మాత్రమే పరిమితం కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని, చదరంగం క్రీడ వల్ల మేథో వికాసం కలుగుతుంది అని మరియు ఫిడే రేటింగ్ క్లాసికల్ 5 రోజుల టోర్నమెంట్ ను అనంతపురంలో నిర్వహించడం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల చదరంగ క్రీడాకారులకు ప్రత్యేకించి రాయలసీమలోని అన్ని జిల్లాల చదరంగం క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరమని ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి అమ్మి రెడ్డి గారు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 182 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు అని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శ్రీమతి ప్రీతి రెడ్డి గారు, కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి గారు తెలిపారు.
ఇంటర్నేషనల్ ఫిడే ఏ క్లాసికల్ రేటింగ్ కలిగినటువంటి 25 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం ఆనందకరమని టోర్నమెంట్ డైరెక్టర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, కోఆర్డినేటర్స్ గోవిందరాజులు, శ్రవణ్ కుమార్ , ఏ1 చెస్ అకాడమి శిక్షకులు మహారాజ్ దేవరాజ్ తెలిపారు.
