అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా మే నెల 11 నుండి 15 వ తేదీ వరకు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య (World Chess Federation FIDE) వారి సౌజన్యంతో జరుగుతున్న ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH రెండవ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసి టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఎన్ఎం అని కుమార్ గారు , చంద్రశేఖర్ గారు, రవీంద్ర గారు, సీనియర్ చెస్ కోచ్ ఆదిరత్న కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చదరంగం ఆడటం వలన గెలుపోటములను సమానంగా తీసుకుని దృక్పథం విద్యార్థులలో అలవడుతుంది అని చంద్రశేఖర్ గారు, రవీంద్ర గారు తెలిపారు.
