ఆధిక్యత కొనసాగిస్తున్న అనంతపురం జిల్లా క్రీడాకారులు భువన కృతి , అస్మిత అనిమి , యం.పి. సహృద్
Posted on 12-05-2023
News image

         అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా మే నెల 11 నుండి 15 వ తేదీ వరకు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య   (World Chess Federation FIDE) వారి సౌజన్యంతో జరుగుతున్న ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH  పోటీల్లో 4వ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసి  శ్రీ సింగనమల రామకృష్ణ గారు, శ్రీ సోమశేఖర్ గారు, గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు, రఘు రెడ్డి గారు  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సింగనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో చదరంగం పోటీలు ఎక్కువగా జరిగేవని భవిష్యత్తులో కూడా ఇది ఇలాగే కొనసాగాలని పోటీలవల్లే విద్యార్థులలో పోటీ తత్వం పెంపొందుతుందని తెలిపారు. గెలుపోటములను సమానంగా తీసుకొని ముందుకు సాగాలని సోమశేఖర్ గారు తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసాలను తట్టుకొని తల్లిదండ్రుల తమ పిల్లల కోసం చదరంగం లో ఎదగాలని సదుద్దేశంతో కృషి చేయడం ఎంతో సంతోషకరమని, తమ విద్యాసంస్థలు ఎప్పటికీ కూడా చదరంగాన్ని ప్రోత్సహించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు తెలిపారు. 


          ఈ టోర్నమెంట్లో మొత్తం 182 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా  మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి 19 మంది క్రీడాకారులు 3/3 పాయింట్లతో ఉన్నారు. నాలుగవ రౌండ్  మొదలయ్యేసరికి   సత్యసాయి జిల్లాకు చెందిన టోర్నమెంట్ టాప్-సీడ్  1666 రేటింగ్ అఫ్రిద్ టి ఖాన్ (3/3 పాయింట్లు) తో అనంతపురం జిల్లా క్రీడాకారిణి భువనకృతి (1077)  (3/3 పాయింట్లతో) ఒకటవ బోర్డులో పోటీపడుతోంది. అలాగే గుంటూరుకు చెందిన (3/3 పాయింట్లు) అమర్ సి.ఎస్ (1441)   తో అనంతపురం జిల్లాకు చెందిన అస్మిత అనిమి (1056) (3/3 పాయింట్లతో) 2వ బోర్డు లో పోటీ పడుతోంది అని టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్ గారు, టోర్నమెంట్ కోఆర్డినేటర్స్ గోవిందరాజులు,  శ్రవణ్ కుమార్  తదితరులు తెలిపారు.