అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా మే నెల 11 నుండి 15 వ తేదీ వరకు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, All India Chess Federation and FIDE వారి సౌజన్యంతో జరుగుతున్న AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH ఆరవ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసి శ్రీ సాయి కృష్ణ గారు , డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు శ్రీ అభిలాష్ రెడ్డి, ముఖ్య కార్యనిర్వహణాధికారి C.E.O. , కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్స్ , చెస్ కోచ్ లు దేవరాజ్, మెహారాజ్ , సీనియర్ నేషనల్ ఆర్బిటర్స్ శివ క్రిష్ణ, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు ప్రారంభించారు.
ఈ టోర్నమెంట్లో మొత్తం 182 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి 5/5 పాయింట్లతో 4 మంది క్రీడాకారులు యం.పి.సహృద్ (అనంతపురం) , అఫ్రిద్ టి ఖాన్ ( శ్రీ సత్య సాయి జిల్లా) , వీరభగతీశ్వర్ రెడ్డి (కడప) , అమర్ సి.యస్. (గుంటూరు) ఆదిత్యలో సమానంగా ఉన్నారు.
ఐదవ రౌండ్ లో సత్యసాయి జిల్లాకు చెందిన టోర్నమెంట్ 6వ టాప్-సీడ్ 1436 రేటింగ్ క్రీడాకారుడు దుర్గాప్రసాద్ (4/4 పాయింట్లు) పై అనంతపురం జిల్లా క్రీడాకారుడు సహృద్ యం.పి. (1186) (4/4 పాయింట్లతో) 3వ బోర్డులో ఆడి విజయం సాధించి 5 ఐదు పాయింట్లు సాధించాడు అని టోర్నమెంట్ ఆర్బిటర్స్ శివక్రిష్ణ, చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్ గారు, టోర్నమెంట్ కోఆర్డినేటర్స్ గోవిందరాజులు, శ్రవణ్ కుమార్ , చెస్ కోచ్ లు దేవరాజ్, మెహారాజ్ తెలిపారు.
అనంతపురంలో ఎంతో శ్రమపడి ఈ 5 రోజుల క్లాసికల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజింగ్ కమిటీ కార్యవర్గ సభ్యులకు, టోర్నమెంట్ డైరెక్టర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, టోర్నమెంట్ చీఫ్ కోఆర్డినేటర్స్ మల్లికార్జున , గోవిందరాజులు , శ్రవణ్ కుమార్ తదితరులు అందరికీ కూడా అభినందనీయం అని , అలాగే చదరంగా అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ముఖ్య అతిథులు అయినటువంటి శ్రీ సాయి కృష్ణ గారు , డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు శ్రీ అభిలాష్ రెడ్డి, ముఖ్య కార్యనిర్వహణాధికారి C.E.O. , కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్స్ తెలిపారు.
