AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH 8వ రౌండు పోటీలను ప్రారంభించిన డాక్టర్ A.C.R దివాకర్ రెడ్డి గారు,మేజర్ మురళీధర్ రావు గారు,రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాంతి భరత్ & జీవన్,డాక్టర్ బాలాజి,ఉదయ్ కుమార్ నాయుడు
Posted on 14-05-2023
News image

ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, All India Chess Federation , FIDE వారి సౌజన్యంతో జరుగుతున్న ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH ఎనిమదవ రౌండు పోటీలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపల్ డాక్టర్ A.C.R. దివాకర్ రెడ్డి గారు, మేజర్ మురళీధర్ రావు గారు, టేబుల్ టెన్నిస్ అనంతపురం జిల్లా ప్రెసిడెంట్, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాంతి భరత్ మరియు జీవన్ , సైక్రియాటిస్ట్ డాక్టర్ బాలాజి గారు , టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్ డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున, టోర్నమెంట్ డైరెక్టర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు ప్రారంభించారు.

      ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి కడపకు చెందిన వీరభగతీశ్వర్ రెడ్డి 7/7 పాయింట్లతో అగ్రస్థానంలో, శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన అఫ్రిద్ టి ఖాన్ 6/7 పాయింట్లతో రెండో స్థానంలో, అనంతపురంకు చెందిన శ్రీహ 6/7 పాయింట్లతో మూడో స్థానంలో ఛాంపియన్షిప్ కైవసం చేసుకోవడానికి పోరాడుతున్నారు.

     ఈ సందర్భంగా చదరంగం క్రీడా భారతదేశానికి పుట్టినిల్లు అని, చదరంగం ఆడటం వలన మేథో శక్తి పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుందని , పోటీతత్వం పెరుగుతుందని , ఏకాగ్రత అలవడుతుందని మన అనంతపురంలో ఇటువంటి క్లాసికల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్  నిర్వహించడం అభినందనీయం అని దీనికి కారణమైన  టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీకి  అభినందనలను A.C.R. దివాకర్ రెడ్డి గారు, మేజర్ మురళీధర్ రావు గారు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాంతి భరత్ మరియు జీవన్ , సైక్రియాటిస్ట్ డాక్టర్ బాలాజి గారు తెలిపారు.