AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH పోటీలు చివరి తొమ్మిదవ రౌండ్ పోటీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వి వి శర్మ గారు సమక్షంలో ప్రారంభం అయ్యాయి.
Posted on 16-05-2023
News image

అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా జరుగుతున్న ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH పోటీలు చివరి తొమ్మిదవ రౌండ్ పోటీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వి వి శర్మ గారు సమక్షంలో పోటీ ముందంజలో ఉన్నటువంటి వీర భగతీశ్వర్ రెడ్డి మరియు కటారి భువనకృతి మొదటి ఎత్తు వేసి పోటీలను ప్రారంభించారు.

             చదరంగంను ఒక క్రీడగా మాత్రమే కాకుండా మేథో శక్తి వికాసానికి ఉపయోగపడే ఒక విద్యా సాధనంగా తీసుకోవాలని , చదరంగం విద్యార్థుల్లో సృజనాత్మకత, ఏకాగ్రత పెంపొందుతుందని ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వి వి శర్మ గారు తెలిపారు.ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న అందరి క్రీడాకారులకు కూడా ప్రోత్సహక మెడల్స్ ను అందరికీ అందజేశారు.

      చదరంగంను ఒక క్రీడగా మాత్రమే కాకుండా మేథో శక్తి వికాసానికి ఉపయోగపడే ఒక విద్యా సాధనంగా తీసుకోవాలని , చదరంగం విద్యార్థుల్లో సృజనాత్మకత, ఏకాగ్రత పెంపొందుతుందని ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వి వి శర్మ గారు తెలిపారు.ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న అందరి క్రీడాకారులకు కూడా ప్రోత్సహక మెడల్స్ ను అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున, ఉపాధ్యక్షుడు కిరణ్, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్, శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి నాగార్జున కర్ణాటకమ్, ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి మరియు టోర్నమెంట్ డైరెక్టర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, బాలరాజు, చెస్ కోచ్ ఆదిరత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.