గత ఐదు రోజులుగా అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా జరుగుతున్న ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH పోటీలు సోమవారం నాటికి ముగిసాయి.
రాష్ట్రవ్యాప్తంగా 182 మంది క్రీడాకారులు పాల్గొనగా మొత్తం తొమ్మిది రౌండ్లు పోటీలు స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహించి విజేతలను ప్రకటించారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా ఎ.స్పీ. శ్రీ కే శ్రీనివాసరావు గారు ఐ.పి.ఎస్. గారు , ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వి వి శర్మ గారు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సురేంద్ర కుమార్ రెడ్డి గారు, కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి గారు, ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ బాలరాజు, కార్యదర్శి మరియు టోర్నమెంట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ నాయుడు, చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్, డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున, నాగార్జున కర్ణాటకమ్, శివక్రిష్ణ,గౌతమి , ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గోవిందరాజులు, చెస్ కోచ్ హాజరత్ కుమార్, మహారాజ్ , దేవరాజ్ తదితరులు హాజరై విజేతలకు నగదు బహుమతులను మరియు మొమెంటులను ప్రదానం చేశారు.
ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య (World Chess Federation FIDE) వారి సౌజన్యంతో నిర్వహించిన ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH పోటీల్లో విజేతల వివరాలు
ఛాంపియన్: వీర భగతీశ్వర్ రెడ్డి
8.5/9 పాయింట్లు , కడప జిల్లా
రన్నరప్: అఫ్రిద్ టి ఖాన్
8/9 పాయింట్లు , శ్రీ సత్యసాయి జిల్లా
3 వ స్థానం : లతీష్ రెడ్డి
7.5/9 పాయింట్లు , తిరుపతి జిల్లా
4 వ స్థానం : అమర్ సి.యస్.
7/9 పాయింట్లు, గుంటూరు జిల్లా
5వ స్థానం : కటారి భవన కృతి
7/9 పాయింట్లు, అనంతపురం
(6 గెలుపు, 2 డ్రా , 1 ఓటమి )
విజేతలందరికీ కూడా ముఖ్య అతిథులు అయినటువంటి శ్రీ శ్రీనివాసరావు ఐపిఎస్ గారు, కె వి వి శర్మగారు, సురేంద్ర కుమార్ రెడ్డి గారు, డాక్టర్ సుప్రజా చౌదరి గారు, ఉదయ్ కుమార్ నాయుడు, ఫణి కుమార్, ఆదిరత్నకుమార్ చేతుల మీదుగా మొత్తం 50,000/- నగదు బహుమతి మరియు మొమెంటోలను అందజేశారు.
