అనంతపురం జిల్లా అండర్ 19 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 ఓపెన్ విజేతలు
Posted on 25-05-2023
News image

1వ రోడ్డు లోని చెస్ బెనిఫిట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వేదికగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా అండర్ 19 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 ఎంపిక పోటీలు నిర్వహించారు‌. 


        అండర్ 19 ఓపెన్ విభాగంలో ప్రతిభ చూపిన టాప్-4 క్రీడాకారులను నంద్యాలలో జూన్ 8 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ 19 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో ; అండర్ 19 బాలికల విభాగంలో ప్రతిభ చూపిన టాప్-4 క్రీడాకారిణులను విజయవాడలో జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ 19 బాలికల ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ , కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు, టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి గారు, కోఆర్డినేటర్ గోవిందరాజులు, చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున, వంశీకృష్ణ తెలిపారు.


అండర్ 19 ఓపెన్ విజేతలు

చాంపియన్ : జి శ్రీహ 3.5/4 పాయింట్లు

రన్నరప్ : యం.పి. సహృద్ 3.5/4 పాయింట్లు

మూడవ స్థానం : కొండూరు రామసాయి 3/4 పాయింట్లు

నాలుగో స్థానం : జానపాటి రోహిత్ 2.5/4 పాయింట్లు


అండర్ 19 బాలికల విజేతలు

చాంపియన్ : అస్మిత అనిమి 4/4 పాయింట్లు

రన్నరప్ : దీపాన్విత 3/4 పాయింట్లు

మూడవ స్థానం : కటారి భువనకృతి 3/4 పాయింట్లు

నాలుగో స్థానం : యశస్విని అనిమి 2.5/4 పాయింట్లు