పి.జి. శ్రావణి
తల్లిదండ్రులు:
పి.జి. రాజేశ్వరి, గృహిణి
పి.జి. సురేష్, సాఫ్ట్‌వేర్
ప్రస్తుతం అనంతపురం లోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ యం.పి.సి. ఇటీవల ద్వితీయ సంవత్సరం విద్యను 955/1000 తో పూర్తి చేసింది.
శ్రావణి , ఒక చదరంగం ను మరొకవైపు చదువు ను సమన్వయపరుస్తూ ప్రతిభ చాటుతోంది.
2019 లో తండ్రి పి జి సురేష్ గారి చెస్ బేసిక్స్ నేర్చుకున్న తరువాత, ఉదయ్ కుమార్ నాయుడు దగ్గర శిక్షణ పొందింది.
=> 2022 లో 2-3 జూలై తేదీల్లో అనంతపురంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-19 బాలికల చెస్ చాంపియన్షిప్-2022 లో పి.జి.శ్రావణి 4.5/6 పాయింట్లు సాధించి 4వ స్థానాన్ని సాధించి పూణేలో నిర్వహించిన ఆల్ ఇండియా నేషనల్ అండర్ -19 బాలికల చెస్ చాంపియన్షిప్ -2022 పోటీల్లో పాల్గొనింది.
=>ఢిల్లీ లోని త్యాగరాజ స్టేడియంలో జూన్ 6-10 వ తేదీ వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో నిర్వహించబోయే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా అండర్-19 బాలికల చెస్ చాంపియన్షిప్ -2022-23 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించబోయే బాలికల జట్టు విభాగంలో అనంతపురం జిల్లా క్రీడాకారిణి అయినటువంటి పి.జి. శ్రావణి పాల్గొనబోతోంది. 2022 డిసెంబర్ 21 నుంచి 22వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలి లో నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ -19 బాలికల చెస్ చాంపియన్షిప్ -2022-23 పోటీల్లో 4/5 పాయింట్లతో 4 వ స్థానం సాధించి, ఈ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
ఈ సందర్భంగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు, సీనియర్ నేషనల్ ఆర్బిటర్ మల్లికార్జున, చెస్ కోచ్ గోవిందరాజులు జాతీయ స్థాయి ఫోటోలు కూడా రాణించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించి అభినందించారు.
