స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె హర్షవర్ధన్ , ఐ.ఏ.యస్. గారిని కలిసిన ఆంధ్ర చెస్ అసోసియేషన్ అఫీషియల్స్
Posted on 09-06-2023
News image

ఆంధ్ర చెస్ అసోసియేషన్ అఫీషియల్స్ ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె హర్షవర్ధన్ , ఐ.ఏ.యస్. గారిని SAAP Headquarters లో విజయవాడలో కలవడం జరిగింది.  

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చదరంగక్రీడాభివృద్ధి గురించి, వివిధ టోర్నమెంట్లు & సెలక్షన్స్ వివరాలు, వాటి నిర్వహణ, క్రీడాకారుల వివరాల గురించి వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి www.apchess.org వెబ్ సైట్ ద్వారా చదరంగం క్రీడాకారులందరికీ కూడా రాష్ట్రస్థాయి పోటీల వార్షిక క్యాలెండర్ గురించి, జిల్లాస్థాయి సెలక్షన్స్ కూడా వెబ్సైట్ ద్వారా డిజిటలైజ్ చేయడం గురించి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.

        ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంతవరకు జరిగిన వివిధ ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ టోర్నమెంట్స్ , గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్స్ , నేషనల్ టోర్నమెంట్స్ వివరాలు వివరించిన తరువాత 4వ గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్ నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని వాటి యొక్క విధివిధానాలను ఇవ్వాల్సిందిగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి సూచించడం జరిగింది.


        స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె హర్షవర్ధన్ , ఐ.ఏ.యస్. గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చదరంగ క్రీడాభివృద్ధి, వివిధ రకాల టోర్నమెంట్లు నిర్వహణ, www.apchess.org వెబ్ సైట్ నిర్వహణ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. 


              ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్షిప్ పోటీలను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కేటాయించి నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా చదరంగం అభివృద్ధికి ఉపయోగపడిందని, 4 డిసెంబర్ 2022న ఒకేరోజు ఏడు ప్రాంతాల్లో SAAP లీగ్ చెస్ టోర్నమెంట్లో 955 క్రీడాకారులు పాల్గొనడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఈ తరహా పోటీలను తిరిగి పునరావృతం చేయవలసిందిగా కోరారు.

             చదరంగ భారతి ద్వారా ప్రతి జిల్లాలో కూడా అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు కావలసినటువంటి బేసిక్ చదరంగం శిక్షణ ఇవ్వడానికి కావాల్సిన ట్రైనర్స్ ను తయారుచేయడానికి 2022 అక్టోబర్ నెలలో చదరంగ భారతి పేరుతో చేసినటువంటి పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైన సందర్భంగా స్పోర్ట్స్ మినిస్టర్ , SAAP VCMD హాజరై సర్టిఫికేషన్ ప్రధానం చేసినటువంటి తరహా, భవిష్యత్తులో ఇదే తరహా మరిన్ని కార్యక్రమాలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారితో కలిసి నిర్వహించేందుకు SAAP ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని తెలిపారు. త్వరితగతిన మరింత మంది ట్రైనర్స్ ని తయారు చేయవలసిందిగా సూచించడం జరిగింది.

         గత సంవత్సరం సీనియర్ నేషనల్ ఆర్బిటర్ సెమినార్ ద్వారా మొత్తంగా 80 మంది పైచిలుకు సీనియర్ నేషనల్ ఆర్బిటర్స్, 8 మంది ఫిడే ఆర్బిటర్స్ ఉండగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ లో నిర్వహించబోయే ఫిడే ఆర్బిటర్ సెమినార్ ద్వారా కొత్త ఫిడే ఆర్బిటర్స్ అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు.

         ఇటీవల కొత్తగా ప్రారంభించిన ప్రభుత్వ హోం స్ట్రీట్ చిల్డ్రన్ చదరంగ శిక్షణ శిబిరాల గురించి తెలుసుకొని , క్రీడల ద్వారా సామాజిక సేవను చేయటం అభినందనీయమని తెలిపారు.        

           ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె హర్షవర్ధన్ , ఐ.ఏ.యస్. గారు ఈ సందర్భంగా సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్త-కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు, కృష్ణ జిల్లా కార్యదర్శి ఫణి కుమార్ , యన్.టి.ఆర్ జిల్లా ప్రెసిడెంట్ అక్బర్ బాషా గారు కార్యదర్శి రాజీవ్ పాల్గొన్నారు.