SPSR NELLORE PLAYER CLINCH U 19 AP STATE GIRLS CHESS CHAMPIONSHIP
Posted on 18-06-2023
News image

*అండర్ 19 ఏపీ స్టేట్ బాలికల చదరంగం ఛాంపియన్ గా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం బాలిక (AFM) జి హిమ తేజస్విని*


ఈ నెల 15వ తేదీ నుండి విజయవాడలో జరుగుతున్న అండర్ 19 ఏపీ స్టేట్ బాలికలు చదరంగం చాంపియన్షిప్ నందు బుచ్చిరెడ్డిపాలెం కు చెందిన (AFM)జి హేమ తేజస్విని అపార ప్రతిభ కనబరిచి ఛాంపియన్గా నిలిచింది.


అండర్ 19 బాలికల చదరంగం స్టేట్ చాంపియన్షిప్ ను గెలవడం ఈ బాలికకు వరుసగా రెండవ సారి.

 గుజరాత్ లో నిర్వహించబోయే నేషనల్ ఛాంపియన్షిప్ నందు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది .


నేషనల్ ఛాంపియన్షిప్ లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆంధ్ర చేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె వి శర్మ, కోశాధికారి జ్వాలాముఖి, వైస్ ప్రెసిడెంట్ పీ మస్తాన్ బాబు మరియు టోర్నమెంట్ ఆర్గ నైజర్ ఎం రాజీవ్ బాలికను కోచ్ ప్రదీప్ ను ప్రత్యేకంగా అభినందించారు.