ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ క్లాసికల్ విభాగంలో 1022 రేటింగ్ ను కైవసం చేసుకున్న కొండూరు రామ్ సాయి
జూలై 11 న అఖిల భారత చదరంగ సమాఖ్య మరియు ప్రపంచ చదరంగ సమాఖ్య సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో అనంతపురం జిల్లా క్రీడాకారుడు కొండూరు రామ్ సాయి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ క్లాసికల్ విభాగంలో 1022 రేటింగ్ ను కైవసం చేసుకున్నాడు.
క్రీడాకారుడి పేరు: కొండూరు రామ్ సాయి
తల్లితండ్రులు :
వై. శశికళ గృహిణి,
కొండూరు రాజు, పోలీస్ కానిస్టేబుల్
అనంతపురంలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న రామ్ సాయి ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ సాధించిన సందర్భంగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు అభినందనలు తెలిపారు.
