ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య (World Chess Federation FIDE) వారి సారథ్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఏ1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా ఆగష్టు 24 నుండి 27 వ తేదీ వరకు నిర్వహించబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్ -2023 Andhra Pradesh State Under-15 Open FIDE Rating Chess Championship-2023 సంబంధిత టోర్నమెంట్ బ్రోచర్ ను అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె . శ్రీనివాసరావు ఐ.పి.యస్. గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, చైర్మన్ బాలరాజు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి గారు, కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య గారు, లెక్చరర్స్ శ్రీమతి అన్నపూర్ణ గారు, రేణుకా దేవి , సీనియర్ నేషనల్ ఆర్బిటర్ మల్లికార్జున, టోర్నమెంట్ ఆర్గనైజర్ శ్రవణ్ కుమార్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి అండర్ 15 విభాగంలో నలుగురు క్రీడాకారుల చొప్పున సెలెక్టెడ్ క్రీడాకారులు ₹500 చొప్పున మరియు స్పెషల్ ఎంట్రీ ఫీజు ₹1000 ద్వారా ఇతర క్రీడాకారులు పాల్గొంటారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ₹30,000/- క్యాష్ ప్రైజ్ ఫండ్ ని వివిధ కేటగిరిల్లో మొత్తం కలిపి 32 నగదు బహుమతులుగా ఇవ్వడంతో పాటు టాప్ -4 క్రీడాకారులను జాతీయస్థాయి అండర్ 15 ఓపెన్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కాబట్టి, అనంతపురం జిల్లాలోని ప్రతి పాఠశాలలోని క్రీడాకారిణి క్రీడాకారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యస్.పి. శ్రీ శ్రీనివాస రావు గారు, టోర్నమెంట్ డైరెక్టర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.
మరిన్ని వివరాలకి www.apchess.org వెబ్ సైట్ ను , 9701076386 ను , 7893878177 ను సంప్రదించవలసిందిగా టోర్నమెంట్ ఆర్గనైజర్ శ్రవణ్ కుమార్ మరియు కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలిపారు.
