అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా అనంతపురం జిల్లా స్థాయి మహిళా టీమ్ చెస్ ఛాంపియన్షిప్ -2023
Posted on 17-07-2023
News image

ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా అనంతపురం జిల్లా స్థాయి మహిళా టీమ్ చెస్ ఛాంపియన్షిప్ -2023 పోటీలను నిర్వహించినట్లు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు, కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శంకరయ్య గారు , వైస్ ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ రంగయ్య, లెక్చరర్ శ్రీమతి అన్నపూర్ణ , వ్యాయామ లెక్చరర్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు.

ప్రథమ స్థానం: సారిక వాసి 4.5/5 పాయింట్లు 

ద్వితీయ స్థానం : తస్నీమ్ ఫిర్దౌస్ షేక్ 4.5/5 పాయింట్లు 

తృతీయ స్థానం: సుకృత ఎ 4/5 పాయింట్లు

నాల్గవ స్థానం: నౌమిక కాశి 4/5 పాయింట్లు


ఈ టాప్-4 క్రీడాకారుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి మహిళా టీమ్ చెస్ ఛాంపియన్షిప్ -2023 పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు అని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శంకరయ్య గారు , వైస్ ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ రంగయ్య, లెక్చరర్ శ్రీమతి అన్నపూర్ణ , వ్యాయామ లెక్చరర్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు.