అంతర్జాతీయ చదరంగ దినోత్సవ వేడుకలు-2023 @అనంతపురం
Posted on 20-07-2023
News image

అంతర్జాతీయ చదరంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఓపెన్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ  గురువారం అనంతపురంలోని 1వ రోడ్డులోని చెస్ బెనిఫిట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించినట్లు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు , టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి, చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున, గౌరవ సభ్యులు హేమ, వంశీక్రిష్ణ, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలిపారు.


ప్రథమ స్థానం:  సహృద్ యం.పి. 4/4 పాయింట్లు 

ద్వితీయ స్థానం: రామ్ సాయి కె  3/4 పాయింట్లు 

తృతీయ స్థానం: ఇంటూరి మాధవ నాయుడు

నాల్గవ స్థానం: వెన్నపూస షణ్ముఖ రెడ్డి 


టాప్-4 క్రీడాకారులు విజయనగరంలో జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఓపెన్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు అని టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు,గౌరవ సభ్యులు హేమ, వంశీక్రిష్ణ తెలిపారు.