విజయవంతంగా ముగిసిన అనంతపురం జిల్లా అండర్-15 ఓపెన్ చెస్ చాంపియన్షిప్-2023
Posted on 30-07-2023
News image

ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా అండర్-15 ఓపెన్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీలను అనంతపురంలోని వేణుగోపాల్ నగర్ లో గల శ్రీ విద్యానికేతన్ ఇంగ్లీషు మీడియం హై స్కూల్ లో నిర్వహించినట్లు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు. 


         జిల్లా వ్యాప్తంగా ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 59 మంది క్రీడాకారులు పాల్గొనగా , స్విస్ లీగ్ పద్ధతిలో మొత్తం ఆరు రౌండ్లు పోటీలు నిర్వహించినట్లు చీఫ్ ఆర్బిటర్ శ్రీమతి గౌతమి తెలిపారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ సుప్రజా చౌదరి గారు, డాక్టర్ వసుంధర గారు, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విద్యాసాగర్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు , టోర్నమెంట్ సభ్యులు కటారి హేమ , వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


చాంపియన్: సామ్యూల్ స్టీఫెన్ నోబుల్ 6/6 పాయింట్లు

రన్నరప్: సహృద్ యం.పి. 5.5/6 పాయింట్లు

తృతీయ స్థానం: ‌ రోహిత్ జె 5/6 పాయింట్లు

నాలుగో స్థానం: కృష్ణ సుధీంద్ర వెంకట సముద్రాల 4.5/6 పాయింట్లు

ఐదవ స్థానం:  రామ్ సాయి కె 4.5/6 పాయింట్లు

ఆరవ స్థానం: కాశి నౌమిక 4.5/6 పాయింట్లు


            ఈ ఫోటోలోని టాప్-4 క్రీడాకారులు వచ్చే నెల ఆగస్టు 24 నుండి 27 వరకు అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా ఏ1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య   (World Chess Federation FIDE) వారి సారథ్యంలో నిర్వహించబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్ -2023 Andhra Pradesh State Under-15 Open FIDE Rating Chess Championship-2023 పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి అండర్ 15 విభాగంలో నలుగురు క్రీడాకారుల చొప్పున సెలెక్టెడ్ క్రీడాకారులు ₹500 చొప్పున మరియు స్పెషల్ ఎంట్రీ ఫీజు  ₹1000 ద్వారా ఇతర క్రీడాకారులు పాల్గొంటారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ₹30,000/- క్యాష్ ప్రైజ్ ఫండ్ ని వివిధ కేటగిరిల్లో మొత్తం కలిపి 32 నగదు బహుమతులుగా ఇవ్వడంతో పాటు టాప్ -4 క్రీడాకారులను జాతీయస్థాయి  అండర్ 15 ఓపెన్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ఫిడే క్లాసికల్ రేటింగ్ వచ్చే అవకాశాలు  పుష్కలంగా ఉన్నాయని కాబట్టి, అనంతపురం జిల్లాలోని ప్రతి పాఠశాలలోని క్రీడాకారిణి క్రీడాకారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  టోర్నమెంట్ డైరెక్టర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు , టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలిపారు.

మరిన్ని వివరాలకి www.apchess.org వెబ్ సైట్ ను , 9701076386 ను , 7893878177 ను  సంప్రదించవలసిందిగా టోర్నమెంట్ ఆర్గనైజర్ శ్రవణ్ కుమార్ మరియు కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలిపారు.