జాతీయస్థాయి అండర్ 11 ఓపెన్ & బాలికల చెస్ చాంపియన్షిప్- 2023 పోటీల్లో ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్న అనంతపురం జిల్లా క్రీడాకారులు సామ్యూల్ స్టీఫెన్ నోబుల్, సహృద్ యం.పి.
Posted on 13-08-2023
News image

చెస్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో 10,11, 12 తేదీల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-11 ఓపెన్ & బాలికల చెస్ చాంపియన్షిప్- 2023 పోటీల్లో అనంతపురం జిల్లా క్రీడాకారులు రాణించారు.

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-11 ఓపెన్ చెస్ చాంపియన్షిప్- 2023 పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 136 మంది ఓపెన్ విభాగంలో పాల్గొనగా సామ్యూల్ స్టీఫెన్ నోబుల్ 7.5/8 పాయింట్లతో చాంపియన్షిప్ టైటిల్ ను కైవసం చేసుకోగా, సహృద్ యం.పి. 6.5/8 పాయింట్లతో 4వ స్థానం కైవసం చేసుకున్నారు.


        అక్టోబర్ 1 నుండి 7వ తేదీ వరకు విశాఖపట్నం నిర్వహించబోయే నేషనల్ అండర్ 11 ఓపెన్ & బాలికల చెస్ చాంపియన్షిప్- 2023 పోటీల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఓపెన్ విభాగంలో పాల్గొనబోయే టాప్-4 స్థానాల్లో ప్రథమ స్థానం సామ్యూల్ స్టీఫెన్ నోబుల్ (7.5/8 పాయింట్లు ) ; 4 వ స్థానం సహృద్ యం.పి. (6.5/8 పాయింట్లు ) కైవసం చేసుకుని ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వి వి శర్మ, కార్యదర్శి సనపల భీమారావు చేతుల మీదుగా నగదు బహుమతిని మరియు ప్రశంస పత్రాన్ని కూడా అందుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు జాతీయస్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.