అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా ఏ1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య (World Chess Federation FIDE) వారి సారథ్యంలో ఆగస్టు 24 నుండి 27 వరకు నిర్వహించబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్ -2023 Andhra Pradesh State Under-15 Open FIDE Rating Chess Championship-2023 పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి అని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ , గౌరవ చైర్మన్ బాలరాజు తెలిపారు.
చదరంగం ఆడటం వల్ల పిల్లల మేథో వికాసానికి ఉపయోగపడుతుందని , ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్య అతిథి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య గారి తెలిపారు. భారతదేశం చదరంగానికి పుట్టినిల్లు అని ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ గారు తెలిపారు. ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఎల్లవేళలా చదరంగ క్రీడాకారుల ఎదుగుదలకు కృషి చేస్తుందని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ తెలిపారు.
ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఫణికుమార్ సమక్షంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య గారు మరియు ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ గారు మొదటి ఎత్తు వేసి పోటీలను ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 111 మంది క్రీడాకారులు పాల్గొన్నారు అని ఇంటర్నేషనల్ ఆర్బిటర్ మరియు టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ N M ఫణి కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు, ఇతర ఆర్బిటర్స్ , మల్లికార్జున, శివ క్రిష్ణ, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
