ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ -15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో నాల్గవ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసి ప్రారంభించిన ముఖ్య అతిథి కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అభిలాష్ రెడ్డి
Posted on 25-08-2023
News image

అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా ఏ1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ -15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో 3 రౌండ్ల పోటీలు ముగిసేసరికి 13 మంది క్రీడాకారులు 3/3 పాయింట్లతో పోటీ పడుతున్నారు. 


       నాల్గవ రౌండు పోటీలను ముఖ్య అతిథి అయినటువంటి కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అభిలాష్ రెడ్డి గారు మరియు ఆర్బిటర్ హరి ప్రసాద్, స్పాన్సర్ ఉమాదేవి , ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాశి రవీంద్ర , మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. ప్రతి మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరమని అందుకు ఉపయుక్తమౌతుంది అనే ఉద్దేశంతోనే కేర్ అండ్ క్యూర్ చెస్ క్లబ్ ద్వారా చదరంగ శిక్షణ ఇస్తూ జిల్లాలో చదరంగా అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా శ్రీ అభిలాష్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ ఉమాదేవి , చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్, ఆర్బిటర్స్ శివక్రిష్ణ , జొన్నగడ్డల గౌతమి, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు, చెస్ కోచ్ దేవరాజ్, మెహారాజ్ తదితరులు పాల్గొన్నారు.