ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ -15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో ఐదవ రౌండు పోటీలను ముఖ్య అతిథి ఏ1 చెస్ అకాడమీ వ్యవస్థాపకురాలు అమ్మినేని తులసమ్మ
ఏ1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ -15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో భాగంగా ఐదవ రౌండు పోటీలను ముఖ్య అతిథి ఏ1 చెస్ అకాడమీ వ్యవస్థాపకురాలు అమ్మినేని తులసమ్మ, సీనియర్ నేషనల్ ఆర్బిటర్ హరి ప్రసాద్, శివ క్రిష్ణ, జొన్న గడ్డల గౌతమి మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. చదరంగం ఆడటం వలన మేథో శక్తి పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుందని , పోటీతత్వం పెరుగుతుందని , ఏకాగ్రత అలవడుతుందని ఏ1 చెస్ అకాడమీ వ్యవస్థాపకురాలు అమ్మినేని తులసమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్ N M ఫణికుమార్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
