ఏ1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ -15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో భాగంగా ఆరవ రౌండు పోటీలను ముఖ్య అతిథిలైన రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాంతి భరత్ , జీవన్, ఏ1 చెస్ అకాడమీ వ్యవస్థాపకురాలు అమ్మినేని తులసమ్మ, సీనియర్ నేషనల్ ఆర్బిటర్ జొన్న గడ్డల గౌతమి మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చదరంగం క్రీడా భారతదేశానికి పుట్టినిల్లు అని, చదరంగం ఆడటం వలన మేథో శక్తి పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుందని , పోటీతత్వం పెరుగుతుందని , ఏకాగ్రత అలవడుతుందని రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాంతి భరత్ మరియు జీవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్ N M ఫణికుమార్, మల్లికార్జున, శివ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం జరిగే 7వ మరియు 8వ రౌండ్ల పోటీలతో విజేతలు ఎవరో అని తెలుస్తుందని చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్ తెలిపారు.
