రాష్ట్రస్థాయి అండర్ 15 ఓపెన్ చెస్ చాంపియన్షిప్ 7వ రౌండ పోటీలు ముఖ్యఅతిథి శ్రీ రామాంజనేయులు R.S.I. విశిష్ట అతిధి శాంత కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి


ఏ1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ -15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో భాగంగా 7వ రౌండ పోటీలను ముఖ్యఅతిథి శ్రీ రామాంజనేయులు R. S.I. గారి ఆధ్వర్యంలో శాంతి కుమార్ గారు , టోర్నమెంట్ ఆర్గనైజర్ శ్రవణ్ కుమార్ , రాజా రెడ్డి గారు, రామ్మోహన్ గారు మొదటి ఎత్తు వేసి ఏడవ రౌండు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఫణి కుమార్, ఆర్బిటర్స్ మల్లికార్జున, శివక్రిష్ణ, హరి ప్రసాద్ చెస్ కోచ్ నందకిషోర్ , టోర్నమెంట్ డైరెక్టర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.