ఏ1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ -15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 ఎంపిక పోటీలు విజయవంతంగా ఆదివారంతో ముగిసాయి అని టోర్నమెంట్ ఆర్గనైజర్ శ్రవణ్ కుమార్, ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, గౌరవ చైర్మన్ బాలరాజు తెలిపారు.
స్విస్ లీగ్ పద్ధతిలో మొత్తం 8 రౌండ్ల పోటీలు నిర్వహించగా 8/8 పాయింట్లతో చాంపియన్షిప్ టైటిల్ ను యన్.టి.ఆర్. జిల్లా విజయవాడకు చెందిన ఫిడే మాస్టర్ యం.డి. ఇమ్రాన్ ( క్లాసికల్ రేటింగ్ 2197)
₹5000/- నగదు బహుమతి
రన్నరప్ గా అనంతపురం జిల్లాకు చెందిన సామ్యూల్ స్టీఫెన్ నోబుల్ 7/8 పాయింట్లు
₹3,000/- నగదు బహుమతి
3వ స్థానం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మజ్జి రామ్ చరణ్ తేజ 6.5/8 పాయింట్లు
₹2000/- నగదు బహుమతి
4వ స్థానం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీతసాగర్ కోనపర్తి
6.5/8 పాయింట్లు
₹1500/- నగదు బహుమతి
5వ స్థానం కాకినాడ జిల్లాకు చెందిన యశస్వి సత్య గంగాధర్
6/8 పాయింట్లు
₹1000/- నగదు బహుమతి
6వ స్థానం బాపట్ల జిల్లాకు చెందిన తల్లా నిశ్చల్
6/8 పాయింట్లు
₹1000/- నగదు బహుమతి
7వ స్థానం అనంతపురం జిల్లాకు చెందిన యం.పి. సహృద్
6/8 పాయింట్లు
₹1000/- నగదు బహుమతి కైవసం చేసుకున్నారు.
ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ₹30,000/- క్యాష్ ప్రైజ్ ఫండ్ ని వివిధ కేటగిరిల్లో మొత్తం కలిపి 32 నగదు బహుమతులుగా ఇవ్వడంతో పాటు టాప్ -4 (Top -4 Players ) క్రీడాకారులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాతీయస్థాయి అండర్ 15 ఓపెన్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారు అని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.
బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య గారు, విశిష్ట అతిధులుగా రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాంతి భరత్, జీవన్ కుమార్, ప్రత్యేక అతిథిగా డాక్టర్ సుప్రజా చౌదరి గారు, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి రంగయ్య గారు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ గారు , ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు , టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్ , శ్రీ సత్య సాయి జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి నాగార్జున కర్ణాటకమ్ , తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున , పాల్గొన్నారు.
