అనంతపురం జిల్లా అండర్-15 బాలికల చెస్ చాంపియన్షిప్-2023 విజేత సుకృత, రన్నరప్ నౌమిక
ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా అండర్-15 బాలికల చెస్ చాంపియన్షిప్-2023 పోటీలను అనంతపురంలోని 1వ రోడ్డులోని చెస్ బెనిఫిట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించినట్లు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.
ప్రథమ స్థానం: ఎ సుకృత 3/3 పాయింట్లు
ద్వితీయ స్థానం: కాశి నౌమిక 2/3 పాయింట్లు
తృతీయ స్థానం: కాశి సమిక 1/3 పాయింట్లు
విజేతలు గుంతకల్లులో సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్ 15 బాలికల ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్-2023 పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు అని టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
