GOLD MEDAL FOR JAHNAVI IN JAWAHAR NAVODAYA U 19 GIRLS NATIONAL CHESS CHAMPIONSHIP
జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో జాహ్నవి కి బంగారు పతకం
* ఓటమి ఎరుగని వైనం
* ఆడిన ప్రతి గేమ్ లో విజయం
విడవలూరు మండలం అలగానిపాడు కు చెందిన సమాధి జాహ్నవి మరో మారు చదరంగం పోటీల్లో సత్తా చాటింది. ఈమె ప్రస్తుతం మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ స్కూల్ లో ఇంటర్మీడియట్ చదువుతుంది. నవోదయ స్కూల్ స్థాయి లో నిర్వహించిన చదరంగ పోటీల్లో విజయడంకా మోగించింది. ఇ టివల సెప్టెంబర్ 14, 15, 16 తేదీలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో నిర్వహించిన జాతీయ స్థాయి జవహర్ నవోదయ అండర్ 19 బాలికల చదరంగం పోటీల్లో పాల్గొంది. హైదరాబాద్ రీజియన్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించింది. ఆరు రౌండ్లకి గాను ఆరు రౌండ్లు గెలిచి జాతీయ స్థాయి లో బంగారు పతకం గెలిచింది. దీంతో పాటు తొరలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది.హైదరాబాద్ రీజియన్ ఛాంపియన్షిప్ గెలవడం లో టీమ్ కెప్టెన్ గా కీలక పాత్ర వహించి తన విజయాలతో ముఖ్య భూమిక పోషించింది.
ఓటమి ఎరుగని వైనం
తొలుత ఆగస్ట్ లో కర్నూల్ లో జరిగిన క్లస్టర్ స్థాయి పోటీల్లో 5 రౌండ్లలో విజయం సాధించింది.అనంతరం కేరళ రాష్ట్రం లో జరిగిన రీజనల్ స్థాయి పోటీల్లో 5రౌండ్లకి గాను 4.5 పాయింట్లు సాధించింది. తాను పోటీపడిన ప్రతి గేమ్ లో విజయం సాధించింది.
జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన జాహ్నవి ని నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు , ఆ పాటశాల PD సత్యదేవి, కోచ్ ప్రదీప్, ACA రాష్ట్ర ఉపాధ్యక్షుడు మస్తాన్ బాబు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.
