వచ్చే నెల నవంబర్ 26వ తేదీ అనగా ఆదివారం అనంతపురం నగరంలోని కె.యస్.ఎన్. డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల వేదికగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ సారథ్యంలో ఆల్ అనంతపూర్ జిల్లా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఏ1 చెస్ అకాడమీ వారు ఆర్గనైజర్ గా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి స్కూల్స్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్-2023 ను నిర్వహించనున్నట్లు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు, గౌరవ చైర్మన్ బాలరాజు తెలిపారు.
ఈ టోర్నమెంట్ సంబంధిత బ్రోచర్ ను కళాశాల ప్రిన్సిపల్ శంకరయ్య గారు, డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి నరసింహారెడ్డి గారు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ గారు, స్పాన్సర్ ఈపూరి రవికుమార్ , ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ బాలరాజు గారు, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు, ఈపూరి కుసుమాంబ, టోర్నమెంట్ డైరెక్టర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వివిధ స్కూల్స్ నుండి 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనబోతున్నట్లు అనంతపురం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్-కోచ్ పి నరసింహారెడ్డి రెడ్డి గారు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య గారు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ గారు తెలియజేశారు.
ఈ పోటీలు పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఆరు సంవత్సరముల వయస్సు విభాగము నుండి 16 సంవత్సరముల వయస్సు విభాగము వరకు U-6, U-8, U-10, U-12, U-14& U-16 విభాగాల్లో బాలురు మరియు బాలికలు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు గవర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలియజేశారు.
క్రీడాకారులకు వసతి భోజన సౌకర్యం కీర్తిశేషులు ఈపూరి శేషయ్య గారు జ్ఞాపకార్థం వారి మనవరాలు మహాశ్రీ మానస పద్మిని కల్పిస్తున్నట్లు తెలియజేశారు.
సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు పాల్గొనబోయే క్రీడాకారులు ₹500 ప్రవేశం చెల్లించి నవంబర్ 15 వ తేదీ లోపల apchess.org website లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు పూర్తి వివరాలకు 7893878177 నంబరులో సంప్రదించండి.
