నవంబర్ 26వ తేదీ ఆదివారం అనంతపురం నగరంలోని కె.యస్.ఎన్. డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల వేదికగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ సారథ్యంలో ఆల్ అనంతపూర్ జిల్లా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఏ1 చెస్ అకాడమీ వారు ఆర్గనైజర్ గా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి స్కూల్స్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్-2023 విజయవంతంగా ముగిసినట్లు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ బాలరాజు, అధ్యక్షుడు శివ కుమార్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.
ఈ టోర్నమెంట్ కు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి మొత్తంగా 185 (124 బాలురు, 61 బాలికలు) మంది క్రీడాకారులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ శంకరయ్య గారు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ గారు, స్పాన్సర్ ఈపూరి రవికుమార్, ప్రశాంత్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలిపారు.
ప్రతి కేటగిరిలో కూడా టాప్-2 క్రీడాకారులకు మొమెంటును మరియు క్రీడాకారులు అందరికీ కూడా ప్రోత్సాహక మెడల్స్ ను , అలాగే క్రీడాకారులు అందరికీ కూడా ఉచిత భోజనం సదుపాయాన్ని కల్పించిన స్పాన్సర్ ఈపూరి కుసుమాంబ ( కీర్తిశేషులు ఈపూరి శేషయ్య సతీమణి) కు టోర్నమెంట్ నిర్వాహకులు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు.
ఈ పోటీల్లో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆరు సంవత్సరముల వయస్సు విభాగము నుండి 16 సంవత్సరముల వయస్సు విభాగము వరకు U-6, U-8, U-10, U-12, U-14& U-16 విభాగాల్లో బాలురు మరియు బాలికలు వేర్వేరుగా పోటీలు నిర్వహించినట్లు, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఇంటర్నేషనల్ ఫణి కుమార్ గారు , ఆర్బిటర్స్ రామసుబ్బారెడ్డి , శివ క్రిష్ణ, గవర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు తెలియజేశారు.
బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య గారు, హైకోర్టు అడ్వకేట్ శ్రీ దీపక్ దయానంద్ గారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య గారు, హైకోర్టు అడ్వకేట్ శ్రీ దీపక్ దయానంద్ గారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
అండర్ 6 బాలికలు
ప్రథమ స్థానం : విశ్వాని
3/3 పాయింట్లు అనంతపురం జిల్లా
ద్వితీయ స్థానం : షేక్ ఆశి అలీ
2/3 పాయింట్లు , అనంతపురం జిల్లా
అండర్ 6 బాలురు
ప్రథమ స్థానం : వేదేశ్
3/3 పాయింట్లు , కర్నూల్ జిల్లా
ద్వితీయ స్థానం : భగత్ ఆశ్రీత్
2/3 పాయింట్లు పశ్చిమ గోదావరి జిల్లా
అండర్ 8 బాలికలు
ప్రథమ స్థానం : షారోన్ బ్లేస్సి
4/4 పాయింట్లు అనంతపురం జిల్లా
ద్వితీయ స్థానం : హారిక చౌదరి 3/4 పాయింట్లు అనంతపురం జిల్లా
అండర్ 8 బాలురు
ప్రథమ స్థానం : హేమచరణ్ రెడ్డి 4/4 పాయింట్లు అనంతపురం
ద్వితీయ స్థానం : శ్రీ సాకేత్
4/4 పాయింట్లు అనంతపురం జిల్లా
అండర్ 10 బాలికలు
ప్రథమ స్థానం : యశస్విని
4/4 పాయింట్లు , అనంతపురం జిల్లా
ద్వితీయ స్థానం : గుణ శ్రీ
3/4 పాయింట్లు కృష్ణాజిల్లా
అండర్ 10 బాలురు
ప్రథమ స్థానం : హర్షిత్
5/5 పాయింట్లు కర్నూలు జిల్లా
ద్వితీయ స్థానం : గణేష్ సాయి జింక
4/5 పాయింట్లు , అనంతపురం జిల్లా
అండర్ 12 బాలికలు
ప్రథమ స్థానం : అస్మిత అనిమి
4/4 పాయింట్లు, అనంతపురం జిల్లా
ద్వితీయ స్థానం : చందన సహస్ర
3/4 పాయింట్లు, శ్రీ సత్య సాయి జిల్లా
అండర్ 12 బాలురు
ప్రథమ స్థానం : శామ్యూల్ స్టీఫెన్ నోబుల్
5/5 పాయింట్లు అనంతపురం జిల్లా
ద్వితీయ స్థానం : జొన్నగడ్డల నితీష్ చౌదరి
4/5 పాయింట్లు, అనంతపురం జిల్లా
అండర్ 14 బాలికలు
ప్రథమ స్థానం : మెరుగు హాసిని
4/4 పాయింట్లు అనంతపురం జిల్లా
ద్వితీయ స్థానం : ఉష తన్మయి శ్రీ
2/3 పాయింట్లు, కాకినాడ జిల్లా
అండర్ 14 బాలురు
ప్రథమ స్థానం : కుశల్ ఎం
5/5 పాయింట్లు అనంతపురం జిల్లా
ద్వితీయ స్థానం : కౌశిక్ తలారి
4/5 పాయింట్లు నంద్యాల జిల్లా
అండర్ 16 బాలికలు
ప్రథమ స్థానం : అమూల్య సత్యవద
3/3 పాయింట్లు కాకినాడ జిల్లా
ద్వితీయ స్థానం : గీతా మాధురి 2/3 పాయింట్లు అనంతపురం జిల్లా
అండర్ 16 బాలురు
ప్రథమ స్థానం : సాత్విక్ డి ఎస్ డి యు
4/4 పాయింట్లు కోనసీమ జిల్లా
ద్వితీయ స్థానం : సాయి హర్మేష్
3/4 పాయింట్లు నంద్యాల జిల్లా
