అనంతపురం జిల్లా నుండి ముగ్గురు నేషనల్ ఆర్బిటర్స్ గా ఉత్తీర్ణత
విజయనగరంలో డిసెంబర్ 16, 17 తేదీల్లో ప్రపంచ చదరంగ సమాఖ్య మరియు అఖిల భారత చదరంగం సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన సీనియర్ నేషనల్ ఆర్బిటర్ సెమినార్ పరీక్ష ఫలితాలు డిసెంబర్ 22న విడుదలయ్యాయి.అనంతపురం జిల్లా నుండి ముగ్గురు నేషనల్ ఆర్బిటర్స్ గా ఉత్తీర్ణత సాధించారని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు, కోశాధికారి ఇంటూరి కిశోర్ నాయుడు తెలిపారు.
కాశి రవీంద్ర బాబు (ప్రభుత్వ ఉపాధ్యాయుడు) , బోయ గోవిందరాజులు (చెస్ కోచ్) , గంతి మెహరాజ్ (చెస్ కోచ్) ముగ్గురూ కూడా నేషనల్ ఆర్బిటర్స్ గా ఉత్తీర్ణత సాధించారని, వీరు మన జిల్లాలో జరిగే చదరంగం పోటీలకు ఆర్బిటర్స్ గా వ్యవహరిస్తూ చదరంగం క్రీడాభివృద్ధికి దోహదపడతారని ఈ సందర్భంగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
