జాతీయస్థాయి స్కూల్స్ చెస్ టోర్నమెంట్ -2024 పోటీలకు అనంతపురం జిల్లా నుండి 14 మంది క్రీడాకారులు ఎంపిక
Posted on 30-12-2023
News image

ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2023 వ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లు నిర్వహించి పది టోర్నమెంట్ లోను చూపించినటువంటి ప్రతిభ ఆధారంగా ప్రతి క్యాటగిరిలోను టాప్-5 క్రీడాకారులను 2024 జరగబోయే జాతీయ స్థాయి స్కూల్స్ చెస్ టోర్నమెంట్ కు ఎంపిక చేసింది.


అండర్ -6 బాలికల విభాగం

4వ స్థానం: ఆషి అలీ షేక్

10వ స్థానం: కాశి సమిక


అండర్ -8 బాలికల విభాగం

ప్రథమ స్థానం: గిద్దల్ షారన్ బ్లెస్సీ

3వ స్థానం: పల్లినేని హారిక చౌదరి

5వ స్థానం: చీమల ఉపేక్ష రెడ్డి


అండర్ -8 బాలుర విభాగం

2వ స్థానం : మునకల శ్రీ సాకేత్ 


అండర్ -10 బాలికల విభాగం

2వ స్థానం: అవుటి సుకృత

3వ స్థానం: యసస్విని అనిమి 

4వ స్థానం: రెడ్డమ్మగారి తేజస్వి 

5వ స్థానం: హద్విత సంపంగి


అండర్ -10 బాలుర విభాగం

ప్రథమ స్థానం: సాయి యశస్ కె

6 వ స్థానం: రిషిక్ దుద్యాల

7వ స్థానం: పలినేని మోక్షిత్ చౌదరి

8వ స్థానం: గణేష్ సాయి జింకా


అండర్ -12 బాలికల విభాగం

2వ స్థానం: అస్మిత అనిమి 

7వ స్థానం: కాశీ నౌమిక

8వ స్థానం: వాసి సారిక


అండర్ -12 బాలుర విభాగం

5వ స్థానం: చేతన్ రెడ్డి కె వి ఎస్ 

6వ స్థానం: జొన్నగడ్డల నితీష్ చౌదరి


అండర్ -14 బాలికల విభాగం

6వ స్థానం: హాసిని ఎం 


అండర్ -14 బాలుర విభాగం

2వ స్థానం: కృష్ణ సుధీంద్ర వెంకట

సముద్రాల


అండర్ -16 బాలికల విభాగం

10వ స్థానం: గీతా మాధురి

గొడ్డుమర్రి


అండర్ -16 బాలుర విభాగం

4వ స్థానం: చరణ్ దీప్ విల్లూరు


ప్రతి విభాగం లోని టాప్ -5 క్రీడాకారులకు మొమెంటు ప్రదానం అనంతపురంలోని 1వ రోడ్డులో ఉన్న చెస్ బెనిఫిట్స్ ఎడ్యుకేషన్ వేదికగా జరిగింది. ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బహుమతి ప్రదానోత్సవం లో ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఎంపికైన టాప్ -5 క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీల ప్రవేశ రుసుము ఆంధ్ర చెస్ అసోసియేషన్ చెల్లిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.